calender_icon.png 24 January, 2026 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో సాగాలి

24-01-2026 12:00:00 AM

కారేపల్లి కళాశాల ప్రిన్సిపాల్ ఘనంగా జూనియర్ కళాశాల వార్షికోత్సవం

కారేపల్లి, జనవరి 23 (విజయ క్రాంతి): విద్యార్ధులు ఉన్నత లక్ష్యంగా ముందుకు సాగాలని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.విజయకుమారి అన్నారు. శుక్రవారం కళాశాల వార్షికోత్సవంను ఉత్సహపూరిత వాతావరణంలో జరిగింది. ఈసందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు ప్రణాళిక బద్దంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి  కళాశాలకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా కళాశాలలో నిర్వహించిన  క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కఅతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో స్థలదాత నేదునూరి నరేష్, భవన నిర్మాణానికి విరాళ దాత కుమ్మరి కుంట్ల నాగేశ్వరరావు, సింగరేణి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు, కారేపల్లి హైస్కూల్ హెచఎం శ్యామ్, లలిత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జయ తదితరులు పాల్గొన్నారు.