calender_icon.png 24 January, 2026 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

24-01-2026 12:00:00 AM

ములకలపల్లి / అన్నపురెడ్డిపల్లి, జనవరి 23, (విజయక్రాంతి): అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో రూ.31 లక్షల వ్యయంతో నిర్మించిన మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు రూ.15 లక్షలతో నిర్మించబోయే సైన్స్ ల్యాబ్కు శంకుస్థాపన చేశారు.ఎస్సీ కాలనీలో రూ.11 లక్షల 30 వేల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.

అలాగే తెలంగాణా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో రూ.30 లక్షలతో ప్రహరీ గోడ  నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదిక నందు రూ.8 లక్షల 20 వేల విలువైన వ్యవసాయ పనిముట్లను రైతులకు పంపిణీ చేశారు. అదే రైతు వేదికలో రూ.4 లక్షల 30 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, స్థానిక సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.