16-05-2025 12:59:28 AM
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): గత కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల బిల్లులను ఒకేసారి చెల్లించాలని అధికారుల కమిటీకి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు ముక్తకంఠంతో తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 10వేల కోట్ల వరకు వివిధ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఇవన్నీ ఒకేసారి ఇవ్వడం కుదరదని ఉద్యోగ సంఘాల నేతలతో అధికారుల కమిటీ పేర్కొనడాన్ని జేఏసీ నేతలు ఒప్పుకోలేదు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అందుకే క్యాటగిరిల వారీగా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌తోపాటు ఇతరత్రా బిల్లులు చెల్లిస్తామని అధికారులు స్ప ష్టం చేసినట్లు ఉద్యోగుల జేఏసీ నేతలు తెలిపారు. అధికారుల ప్రతిపాదనను జేఏసీ నేత లు విభేదిస్తూ ఇస్తే అన్ని ఒకేసారి ఇవ్వాలని, లేకుంటే సీనియారిటీ ప్రకారమైనా ఇవ్వాలని కమిటీకి జేఏసీ నేతలు కోరారు.
ముం దుగా ఎవరైతే రిటైర్ అవుతారో వారికి తొలుత ఇవ్వాలనే డిమాండ్‌ను కమిటీ ముందు ఉంచారు. వాస్తవంగా ఉద్యోగులకు గ్రాట్యూటీ, జీపీఎఫ్, లీవ్ ఇన్‌క్యాష్‌మెంట్, టీజీఎల్‌ఐ, కమ్యూటేషన్, జీఐఎస్ బిల్లులు రావాల్సి ఉంది. కానీ ఇవన్నీ ఒకేసారి చెల్లించలేమని కమిటీ స్పష్టం చేయడంతో జేఏసీ నేతలు అందుకు ఒప్పుకోలేదు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీతో సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, కృష్ణభాస్కర్ నేతృత్వంలోని అధికారుల కమిటీ గురువారం సమావేశమై దీర్ఘకాలికంగా పెండిం గ్‌లో ఉన్న అంశాలపై చర్చించారు.
ఈనెల 7న మొదటిసారిగా భేటీ అయిన ముగ్గురు అధికారుల కమిటీ తాజాగా గురువారం మరోసారి సమావేశమై 57 అంశాలపై సుమారు రెండు గంటలపాటు చర్చించింది. అయితే ఇందులో ప్రధానంగా 25 డిమాండ్‌లపై కమిటీ సానుకూలంగా స్పందించిన ట్లు, ప్రధాన్య క్రమంలో అంశాలను పరిష్కరిస్తామని కమిటీ తెలిపినట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు.
క్యాబ్‌నేట్ సబ్‌కమిటీకి నివేదిక
ఉద్యోగుల జేఏసీతో భేటీ అయిన అధికారుల కమిటీ అన్ని విజ్ఞప్తులను విన్నామని, ఉద్యోగుల సమస్యలను తాము అర్థం చేసుకున్నామని నేతలతో పేర్కొంది. సమస్యలపై అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారితో తెలిపింది. అన్ని సమస్యలను నిశితంగా పరిశీలించి పరిష్కార మార్గాలను క్యాబినెట్ సబ్‌కమిటీకి నివేదిక సమర్పిస్తామని చెప్పింది. మరోసారి సమావేశానికి పిలుస్తామని జేఏసీ నేతలతో కమిటీ తెలిపినట్లు జేఏసీ నేతలు తెలిపారు.
సమావే శంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు, అడిషనల్ సెక్రటరీ పీ దామోదర్‌రెడ్డి, కోచైర్మన్లు మధుసూదన్‌రెడ్డి, చావా రవి, వీ రవీందర్‌రెడ్డి, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం. హుస్సేని ముజీబ్, ఏ సత్యనారాయణ, వైస్ చైర్మన్లు పర్వత రెడ్డి, ప్రచార కార్యదర్శి బీ శ్యామ్, కార్యదర్శి సతీశ్ పాల్గొన్నారు.
రెండు డీఏలైనా ఇవ్వండి..
ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో కనీసం రెండు డీఏలైనా ఇవ్వాలని జేఏసీ నేతలు కమిటీని కోరినట్లు తెలిసింది. తమపై కిందిస్థాయి ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని కమిటీకి వివరించినట్లు తెలిసింది. తమపై, ప్రభుత్వంపై ఉన్న అసంత ృప్తిని తగ్గించాలంటే తక్షణమే రెండు లేదా కనీసం ఒకటైనా డీఏను విడుదల చేయాలని కోరినట్లు సమాచారం.