16-05-2025 01:04:16 AM
మంథని, మే 15 (విజయకాంత్రి)/కాళేశ్వరం: “కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. అందుకు రూ.100 కోట్లు కావాలని అడిగారు. నేను వంద కాదు రూ.200కోట్లు ఇచ్చి, కాళేశ్వరాన్ని ప్రముఖ పర్యాటక ప్రాం తంగా అభివృద్ధి చేస్తా” అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం కాళేశ్వరంలో పుష్కరస్నాన ఆచరించి, సరస్వతీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
సరస్వతి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ రాహుల్‌శర్మను, ఇతర శాఖల అధికారులను అభినందించారు. పుష్కరాలలో స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుందని సీఎం చెప్పారు. తన హయంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మంథని నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉన్నదని తెలిపారు.
దేశ ఆర్థికాభివృద్ధికి ఆద్యుడు పీవీ నరసింహారావు మంథినివాసి కావడం గొప్ప విషయ మని చెప్పారు. తదుపరి శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించారని అన్నారు. ఆయన సభను ఎంతో హుందాగా నడిపించారని గుర్తు చేశారు. ఆయన తర్వాత మంత్రి శ్రీధర్‌బాబు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తు న్నారని చెప్పారు.
రాష్ట్రంలో లక్షల కోట్లు విదేశీ, స్వదేశీ పెట్టు బడులను పెట్టించడం, ప్రైవేట్ రంగంలో వేల కోట్ల పెట్టుబడులను తెస్తూ రాష్ట్రం అభివృద్ధిలో శ్రీధర్‌బాబు భాగం అవుతున్నారని కొనియాడారు. శ్రీధర్‌బాబును మంథని ప్రజలే కాపాడుకోవా లన్నారు. ఆయన సేవలు రాష్ట్రం యావత్తు అవసరమని, రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ సమ యం కేటాయించాలని తెలిపారు.
గోదావరి, కృష్ణా పుష్కరాలను, సమ్మక్క సారాలమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తామని అన్నా రు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం తరుపున గ్రీన్ ఛానల్ లో నిధులు విడుదల చేస్తా అన్నారు.
ముక్కు సూటిగా మాట్లాడే సీఎం: మంత్రి శ్రీధర్‌బాబు
ముక్కుసూటిగా మాట్లాడే ముఖ్యమంత్రి దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టమని, డొల్లతనం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నాయకుడు ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సరస్వ తీ పుష్కరాలను వైభోవో పేతం గా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున రూ.40 కో ట్లు కేటాయించామని, పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా 19 శాఖల అధికారులు సుమారు 3 నెలలు సమష్టిగా పని చేశారని చెప్పారు.
భక్తులకు సరికొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి ‘టెంట్ సిటీ‘ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా కాశీ నుంచి వచ్చిన వేద పండితుల చేతుల మీదుగా ‘కాళేశ్వర ముక్తీశ్వర స్వామి గోదావరి హారతి’ని నిర్వహిస్తున్నామని చె ప్పారు. పుష్కరా లు ముగిసే వర కు ప్రతి రోజు సాయంత్రం ఈ హారతి కా ర్యక్రమం ఉం టుందన్నారు.
వచ్చే గోదావరి పు ష్కరాల నాటికి కాళేశ్వ రం పుణ్య క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి, రూ.100 కోట్లు కేటాయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. మంథని నియోజకవర్గంలోని రామగిరి మగిరి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎంను కోరారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల కోసం కాశీ పండితులచే గోదావరి హారతి కార్యక్రమం 12 రోజులపాటు నిర్వహిస్తున్నామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో తొలిసారి సరస్వతీ పుష్కరాలు నిర్వహించడం ఆనందంగా ఉన్నదని చెప్పారు.
తెలంగాణతోపాటు దేశ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఈ పుష్కరాలు నిర్వహిస్తున్నామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పుష్కరాల ద్వారా తెలంగాణపై మహాకాలీ, మహాలక్ష్మి, మహా సరస్వతీ ముగ్గు అమ్మవార్ల దీవెనలు ఉండాలని కాంక్షించారు.
సీఎం డౌన్, డౌన్ నినాదాలు
పెద్దపల్లి ఎంపీపై సీఎం సీరియస్
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు హాజరయ్యేందుకు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చారు. కాగా అక్కడే ఉన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వర్గీయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా సీఎం డౌన్ డౌన్ అంటూ ఊహిం చని విధంగా నిరసన చేపట్టారు. అక్కడే ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు.
ప్రతిపక్ష కార్యకర్తలుగా మొదట భావించారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చిత్రంతో కూడిన జెండాలు పట్టుకొని నినాదాలు చేయడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. సరస్వతీ పుష్కరాలలో దళితుడైన ఎంపీ వంశీకృష్ణను అవమానించారంటూ పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ వచ్చింది.
అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను వెంటనే అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఎంపీ వంశీకృష్ణపై పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.