10 August, 2026 | 3:47 AM

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

10-08-2026 12:00 AM

శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్, ఆగష్టు 9(విజయక్రాం తి): అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ నేత శంభీ పూర్ క్రిష్ణ ఆకాక్షించారు.కుత్బుల్లాపూర్ ని యోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భం గా మల్లంపేట్, మహేశ్వరం, బౌరంపేట్, గం డిమైసమ్మ, డి.పోచంపల్లి, సారేగూడెం, శంభీపూర్ ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాలను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్రిష్ణ మాట్లాడు తూ మహిళలు బోనాలు సమర్పించడం, బో నాలు తెలంగాణ సంస్కృతిలో ఒక విశిష్టమై న సంప్రదాయమన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు, నాయకులు, ఆల య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.