హైడ్రాకు మద్దతుగా ర్యాలీ
శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (విజయక్రాం తి):గచ్చిబౌలి జనార్దన్ హిల్స్ కాలనీలో పా ర్కు స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి కాపాడి, తిరిగి అభివృద్ధి చేసిన హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ కాలనీవా సులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. కాలనీవాసుల ఆధ్వర్యంలో కొత్తగా అభివృద్ధి చేసిన పార్కులో ఈ కార్యక్రమం జరిగింది. కాలనీకి సంబంధించిన పార్కు స్థలం కొంతకాలంగా ఆక్రమణకు గురైందని స్థానికులు తెలిపారు.
హైడ్రా అధికారులు చర్యలు చేప ట్టి ఆక్రమణలను తొలగించి పార్కు స్థలాన్ని పరిరక్షించారని పేర్కొన్నారు. అనంతరం మూడు నెలల్లో పార్కును అభివృద్ధి చేసి ప్ర జలకు అందుబాటులోకి తీసుకురావడం ప ట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, స్థానిక ఎమ్మె ల్యే ఆరెకపూడి గాంధీకి కృతజ్ఞతలు తెలుపు తూ కాలనీవాసులు ప్లకార్డులు ప్రదర్శించారు. పార్కు పరిరక్షణకు చర్యలు తీసుకున్న అధికారులకు అభినందనలు తెలిపారు.






