calender_icon.png 11 January, 2026 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వద్దు

09-01-2026 12:00:00 AM

మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి

కుషాయిగూడ, జనవరి 8 (విజయక్రాంతి) : చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లో ఇవ్వకూడదని ఇస్తే వాటి వల్ల అనేకమైన దుష్ఫలితాలు వస్తున్నాయని సినీ ఆర్టిస్ట్ మిమిక్రీ శివారెడ్డి అన్నారు.

బుధవారం రాత్రి కుషాయిగూడ శ్రీ చక్రి విద్యా నికేతన్ స్కూల్ 37వ వార్షికోత్సవానికి శివారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను విద్యార్థుల తల్లి దండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో జనరేషన్ మారిందని చిన్నారులు విద్యార్థులు స్మార్ట్ ఫోన్‌లకు బానిసై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని స్మార్ట్ఫోన్లో నుంచి బయటికి రావాలని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు పలికారు ఒక విద్యార్థి మంచి స్థాయికి ఎదగాలన్న తల్లిదండ్రుల బాధ్యత విద్యా బోధనలు నేర్పించే గురువులది గురుతరమైన బాధ్యత ఉండాలని బండారు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.

అనంతరం విద్యార్థుల డాన్సులు ఆటపాటలు వీక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీ చక్రి విద్యానికేతన్ డైరెక్టర్ డాక్టర్ చక్రధర్ రెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.