21-01-2026 01:48:03 AM
మెస్రం వంశ కొత్త కోడళ్లకు గోవాడలో కిక్రి వాయిస్తూ పాటల రూపంలో బోధనలు
ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 20 (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా గిరిజనులతో పాటు గిరిజనేతరులు ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్‌లోని నాగోబా వైపు ప్రయాణమవుతున్నారు. దీంతో నాగోబా జాతర జన సంద్రంగా మారుతోంది. మరోవైపు నాగో బా సన్నిధిలో బేటింగ్ (పరిచయం) అయిన మెస్రం వంశ కొత్త కోడళ్లకు మెస్రం వంశ ప్రధాన్‌లు తమ సాంప్రదాయ వాయిద్యం ‘కిక్రి‘ ద్వారా నాగోబా చరిత్ర, విశిష్టతను వినిపించారు.
మంగళవారం గోవాడలో నాగోబా సన్నిధిలో బేటింగ్ అయిన కోడళ్లకు నాగోబా దేవుడి పూర్వ చరిత్ర ను సాంప్రదాయ వాయి ద్యం కిక్రి నీ వాయిస్తూ... పాటలు పాడు తూ... నాగోబా చరిత్రను వివరించారు. నాగోబా చరిత్రను వివరించి చెప్పిన ప్రధాన్ లకు బేటింగ్ కొత్త కోడళ్ళు కానుక రూపంలో నగదు అందజేసి, నాగోబా దర్శించుకున్నారు.