24-04-2025 12:45:28 AM
- గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ
గజ్వేల్, ఏప్రిల్ 23 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో మాతా శిశువుకు సంబంధించి అన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సూపర్డెంట్ డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు. బుధవారం ఆసుపత్రి వైద్యులతో కలిసి మాత శిశు ఆసుపత్రిలో ఆపరేషన్లను ఫోటోతెరపి, తదితర సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన మాత శిశు సంరక్షణ ఆసుపత్రిలో గత కొన్ని రోజుల నుంచి ఓపిసేవలు మాత్రమే కొనసాగిస్తున్నామని ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో మాత శిశు సంరక్షణ సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా ఆస్పత్రిలో ప్రసూతి సేవలు ఉండేవని, ఇప్పటినుండి మాత శిశు సంరక్షణ కేంద్రం ఆస్పత్రిలో జరుగుతాయన్నారు.
బుధవారం ఆరు ప్రసూతి ఆపరేషన్ లను నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తామని అని తెలిపారు. గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో మిగతా సేవలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డాక్టర్ జయశ్రీ, డాక్టర్లు రాము, సాయికిరణ్, జ్యోతి. త్రివేణి. మంజుల, నర్సింగ్ సూపర్డెంట్ సువర్ణ. స్వరూప రాణి. ఫార్మసిస్టులు. నర్సింలు. శ్రీనివాసచార్యులు. హెల్త్ అసిస్టెంట్. దేశాన్ని వాసుదేవ్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.