calender_icon.png 1 May, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రైజ్ మనీ

24-04-2025 12:45:37 AM

చేవెళ్ల ఏప్రిల్ 23: ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విగ్నేష్ గౌడ్ ప్రైజ్ మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఆర్డీవో చంద్రకళ, ఎంఈవో పురందాస్  చేతుల మీదుగా విద్యార్థులకు ఈ ప్రైజ్ మనీ అందజేశారు.

ఎంపీసీ ఫస్టియర్లో 468/470 మార్కులు సాధించిన  తెలంగాణ మోడల్ కాలేజీకి చెందిన  శ్రతిలయకు రూ.10 వేలతో పాటు గాయత్రి, భార్గవి, వర్షిత,  శ్రీ చైతన్య  జూనియర్ కాలేజీకి స్టూడెంట్లు  కిరణ్ గౌడ్ , సంజన,  అక్షయ ,  వివేకానంద జూనియర్ కాలేజీకి చెందిన  హాసిని , స్ఫూర్తి , నష్రా సుల్తానాకు రూ. 5 వేల చొప్పున  అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించారు.   

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ...  అమ్మాయిలు అంటే సమాజంలో ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారని  ప్రశంసించారు.   ప్రతిభ సాధించిన  విద్యార్థులు వారు అనుకున్నది సాధించే వరకు పేరెంట్స్ పెళ్లి అంశం రానీయకూడదని సూచించారు.  చదువు విలువ తెలిసి ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఆర్థిక చేయూతనందిస్తున్న  విగ్నేష్ గౌడ్ ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్, కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, నాయకులు పాల్గొన్నారు.