7 March, 2026 | 9:10 AM

అధికారులంతా సమన్వయంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి

07-03-2026 01:20 AM

కలెక్టర్ చంద్రశేఖర్

నల్లగొండ టౌన్, మార్చి 6: ప్రజా ప్రతినిధులు, అధికారులందరు సమన్వయంతో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో ఏర్పాటుచేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సందర్శించారు.

పేదవారికి ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుండి 31 వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఒకరోజు ఆరు రకాల ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను నిపుణులైన డెంటల్, ఓబీజీ, ఆర్తో ,ఆప్తమాలజీ, పీడియాట్రిషన్ డాక్టర్ల చేత వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, మందులు, వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. 

స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రతిరోజు రెండు, మూడు పీహెచ్సీలను కవర్ చేస్తూ ఇలా అన్నిపీ హెచ్ సిలను కవర్ చేయడం జరుగుతుందని తెలిపారు  జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సమన్వయంతో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆప్తమాలజీ, ఆర్తో, డెంటల్, ఇతర కౌంటర్ల తోపాటు, రిజిస్ట్రేషన్ కౌంటర్ ను పరిశీలించి రోగులతో ముఖాముఖి మాట్లాడారు.

సమస్యలను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి డాక్టర్లను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటిండెంట్ నేత నరసింహారావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ,లైన్ వాడ యూపీహెచ్ సి డాక్టర్ ఇఫ్టేయార్, లైన్ వాడ కార్పొరేటర్ మహమ్మద్ ఖాజా సమయుద్దిన్ నదీమ్, డాక్టర్లు తదితరులు ఉన్నారు.