నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి
జూలపల్లిలో పర్వతాల శ్రీ మల్లికార్జున స్వామి వారి షష్టి వారల పల్లకి శోభాయాత్ర కళ్యాణ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు
కమాన్ పూర్ (విజయక్రాంతి): శ్రీ పర్వతాల, మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామములోని శ్రీ మల్లికార్జున స్వామి షష్టి వారల సందర్భంగా శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి వారి పల్లకి శోభాయాత్ర, కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజలతో కలిసి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామివారి పల్లకి శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్రలో పాల్గొన్న ప్రజలందరితో మాట్లాడి, వారి యోక్క యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్వాహకులు శ్రీనుబాబును ఘనంగా సన్మానించి, మల్లికార్జున స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. దేవాలయానికి వచ్చిన శ్రీనుబాబుకు అర్చకులు ఘన స్వాగతం పలికి పర్వతాలు మల్లన్న పట్నాలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు మహేందర్ యాదవ్, కమాన్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వైనాల రాజు, యూత్ యూత్ అధ్యక్షులు రాజ్ కుమార్ రెబల్, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






