16 August, 2026 | 2:30 AM

సర్వజ్ఞలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

16-08-2026 12:59 AM

ఖమ్మం, ఆగస్టు 15(విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ సర్వజ్ఞ పాఠశాల ఆవరణలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వే డుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ ఆర్‌వీ నా గేంద్ర కుమార్  హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మ హనీయులందరినీ ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి కర్తవ్యం అన్నారు. యువతరం దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యం అని గొప్పగా చాటి చెప్పా రు.

చదువుతో పాటు, క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో సమాజానికి ఉపయోగపడే పౌరులు గా ఎదగాలి అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కాగా సర్వజ్ఞ ఎన్‌సీసీ విద్యార్థులు చేసిన పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. పలువురు చిన్నారులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల వేషధారణలో అలరించారు. ఇండియా వా లా, దేశం మనదే, ఎగురుతున్న జెండా, జై హిందుస్థాని, అంటూ సాగిన నృత్యాలు విద్యార్థులను అలరించింది. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమా లు, దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించి విద్యార్థులు ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, ధ్యాయేతర సిబ్బంది, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.