calender_icon.png 18 November, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అధ్యక్షులు మల్లయ్యపై ఆరోపణలు పూర్తి అవాస్తవం

18-11-2025 01:12:07 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్యపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఖాజా పాషా అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొంతకాలంగా బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి ని చూసి ఓర్చుకోలేక స్థానిక ఎమ్మెల్యే వినోద్, పట్టణ అధ్యక్షులు మల్లయ్య, పలువురు కాంగ్రెస్ నాయకులపై లేనిపోని ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు.

దిగజారుడు రాజకీయాలకు దిగుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుండి రూ 50 వేలు, రెండు మద్యం బాటిళ్లు తీసుకుంటున్నారని ఆరోపించడం పూర్తిగా అవాస్తవమన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గం అభివృద్ధికి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. రోడ్డు విస్తరణలో బాధితులకు అండగా నిలిచేందుకు అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని, బి ఆర్ ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుండి డబ్బులు తీసుకుంటున్నట్లు చేసిన ఆరోపణలు 24 గంటల్లోగా నిరూపించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే బీ ఆర్ ఎస్ నాయకులపై పరువు నష్టం దావా వేసి చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు.