18-11-2025 01:33:37 PM
హైదరాబాద్: గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ప్రతివాదులు నిర్దేశించిన సమయంలో కౌంటర్ దాఖలు చేయలేదన్న టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయకపోతే వాదనలు ఎలా వినిపిస్తారని సీజే ప్రశ్నించారు. గ్రూప్-1 నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది. టీజీపీఎస్సీ అప్పీలుపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు సీజే ధర్మాసనం గత విచారణలో సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. గ్రూప్-1 నియామకాలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని హైకోర్టు వివరించింది. ఈ మేరకు వాదనలు విన హైకోర్టు సీజే ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది.