calender_icon.png 18 November, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీలో 31 మంది మావోయిస్టులు అరెస్ట్: ఇంటెలిజెన్స్ ఏడీజీ

18-11-2025 01:46:31 PM

కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టుల అరెస్ట్

అరెస్టైన వారిలో తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ సభ్యులు 

అమరావతి: నెలరోజులుగా మావోయిస్టులకు కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా(Intelligence ADG Mahesh Chandra Laddha) తెలిపారు. మంగళవారం ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్యలో అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharama Raju district) మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగిందని చెప్పారు. మారేడుమిల్లి ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, హిడ్మా భార్య రాజే అలియాస్ రజక్కతో పాటు అనుచరులు మృతి చెందినట్లు ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా పేర్కొన్నారు. మావోయిస్టుల మృతదేహాలు ఎప్పుడు తరలిస్తారన్న దానిపై సమాచారం తెలియాల్సిఉంది.

మావోయిస్టుల నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని  ఏడీజీ మహేష్ చంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్ట్ చేశామని మహేష్ చంద్ర వెల్లడించారు. మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని, అరెస్టు చేసిన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు. ఇంటలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతం చేశామని మహేష్ చంద్ర సూచించారు. ఏపీలోని మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో ఆరుగురు చనిపోయినట్లు లడ్హా తెలిపారు. పోలీసుల సాయంతో పూర్తి ప్రాంతాన్ని కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. రెండు గంటలుగా కేంద్రబలగాల ముమ్మర సోదాలు కొనసాగుతున్నాయి. అటు విజయవాడలో(Vijayawada) మావోయిస్టుల కలకలం రేగింది. మావోయిస్టులు ఆటోనగర్‌లో ఒక భవనాన్నిషెల్టర్‌ జోన్‌గా మార్చుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవనాన్ని ఆక్టోపన్‌ పోలీసులు చుట్టుముట్టారు. భవనంలో భారీగా ఆయుధాలు డంప్‌ చేసినట్టు గుర్తించారు.