calender_icon.png 18 November, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ సార్... కరుణించండి

18-11-2025 01:50:21 PM

తుఫాన్ లో ఒక ఎకరం పూర్తిగా నష్టపోయాను

50,000 నష్టపరిహారం అందించాలని రైతు రవి నాయక్ డిమాండ్

తుంగతుర్తి,(విజయక్రాంతి): ఆరుకాలం కష్టపడి పండించిన రైతుకు తీరా వరి పైరు కోసే దశలో అకాల ప్రకృతి వైపరీత్యం తుఫాన్ రావడంతో నోటి కాడికి వచ్చిన వరి పైరు పూర్తిగా నేలకొరిగి, తడిసి, విత్తనాలుగా మారాయి. సుమారు రూ.50 వేలతో పంట పెట్టుబడి పెట్టాను పూర్తిగా నష్టపోయానని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవుని గుట్ట తండాకు చెందిన లాకావత రవి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్పందించి పంట నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.