15 June, 2026 | 3:05 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

28-10-2025 12:00 AM
  1. కలెక్టర్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు 
  2. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా కొనసాగిన లక్కీ డ్రా భారీ పోలీసు బందోబస్తు

నిజామాబాద్, అక్టోబర్ 27  (విజయక్రాంతి): మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం నిజామాబాద్ నగర శివారులోని భారతీ గార్డెన్ లో  లాటరీ పద్దతిలో వైన్ షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సయిజ్ పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను మొత్తం 2786 దరఖాస్తులు దాఖలయ్యాయి.

ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్ లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపించారు.

పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారినే లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భారతీ గార్డెన్ తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీసు బందోబస్తును పర్యవేక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

లక్కీ డ్రాలో అదృష్టం వరించి వైన్ షాపులు కేటాయించబడిన వారు నిబంధనలను అనుసరిస్తూ, లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు కల్పించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా కొనసాగింది.