calender_icon.png 29 October, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

28-10-2025 12:00:00 AM

14 కేజీల రూ. ఏడు లక్షల విలువైన గంజాయి స్వాధీనం 

వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 27 (విజయక్రాంతి): మండల పరిధిలోని నూగూరు గ్రామ సమీపంలో వెంకటాపురం పోలీసుల తనిఖీల్లో సుమారు 7 లక్షల రూపాయల విలువైన 14 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు నాగారం ఎస్పీ శివ ఉపాధ్యాయ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో గంజాయి ద్విచక్ర వాహనాలపై అక్రమంగా రవాణా అవుతున్నట్లు అందిన విశ్వాసనీయ సమాచార మేరకు వెంకటాపురం ఎస్‌ఐ కొప్పుల తిరుపతిరావు నేతృత్వంలో పోలీసులు నూగూరు గ్రామ సమీపంలో ఆదివారం తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి పట్టుపడ్డట్లు ఆయన వివరించారు.

ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు బ్యాగ్ లో గంజాయి ప్యాకెట్లను తనిఖీల సమయంలో వాహనాన్ని ఆపి గుర్తించిన పోలీసులను చూసి వెనకగా వస్తున్న మరో రెండు ద్విచక్ర వాహనాలను వ్యక్తులు పరారయ్యారని తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లా మన్నెంకొండ మండలం పెంకరాయ గ్రామానికి చెందిన తాటి ఇర్మా ఎలియాస్ సత్యం, మడకం రాయి ఎర్ర ఎలియాస్ రమేష్ లు తనిఖీల్లో పట్టుబడగా మరో రెండు ద్విచక్ర వాహనాల్లో నలుగురు వ్యక్తులు పోలీసుల తనిఖీలను చూసి సమీప అడవుల్లోకి పారిపోయారని వివరించారు. వారం రోజుల క్రితం ములుగు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒరిస్సా రాష్ట్రం మల్కాజిగిరి ప్రాంతానికి వెళ్లి సదరు నిందితులను కలిసి తమ ప్రాంతంలో గంజాయి దొరకడం లేదని పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉన్నాయని తమకు గంజాయి కావాలని కోరారని తెలిపారు.

వారిని అక్కడే ఉంచి గంజాయి విక్రయితలు మల్కానగిరి జిల్లాలోని డొంకరాయి, కేరళంపల్లి, బాదారి, చిత్రకొండ, వడియాకేంపాడు ఏరియాలో అక్కడక్కడ తిరిగి గంజాయిని సేకరించి 28 కేజీల గంజాయిని వీరికి సమకూర్చినట్లు తెలిపారు. ఈ గంజాయిని నాలుగు బ్యాగుల్లో చక్రవాహనాల్లో ములుగు ప్రాంతానికి తరలించే క్రమంలో వెంకటాపురం గ్రామ శివారులోని నౌకరు గ్రామ వద్ద ఇద్దరు పట్టుబడ్డట్లు వారి వద్ద 14.231 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులను విచారించగా పారిపోయిన వ్యక్తులు మల్కానగిరి జిల్లా దుప్పులకొండ గ్రామానికి చెందిన కులం దుర్గయ్య, సద్భానపల్లి గ్రామానికి చెందిన సోడి జోగయ్య, శోభన బోయిన చందు మరొక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు వివరించారు. ఈ గంజాయిని ఆ ప్రాంతంలో నిందితులు రూ 4,000 చొప్పున కొనుగోలు చేసి ఈ ప్రాంతానికి చెందిన వారికి రూ. 10.000లకు విక్రయించినట్లు తమ విచారణలో వెళ్లడైందన్నారు.

అక్కడ మొత్తం 28 కేజీలు కొనుగోలు చేయగా తమ పట్టుకున్న నిందితుల వద్ద 14. 231 కేజీల గంజాయి పట్టుబడగా మిగతా మొత్తం పరాయిన వారి వెంట తీసుకువెళ్లారన్నారు. ఎంజాయ్ నిందితులపై ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం కేసును నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు. పరారైన వారికోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడతామని వివరించారు. గంజాయిని పట్టుకున్న వెంకటాపురం పోలీసులను ఆయన అభినందించారు.