28-10-2025 12:00:00 AM
కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు, అక్టోబరు27 (విజయక్రాంతి): ములుగు ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావులతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో 61 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 19, గృహ నిర్మాణ శాఖకు 10 పెన్షన్ 05, ఉపాధి కల్పనకు 04, ఇతర ఇతర శాఖలకు సంబంధించినవి 23 దరఖాస్తుల స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.