calender_icon.png 7 June, 2025 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీనాక్షి నటరాజన్‌ను కలిసిన అల్లూరి కృష్ణవేణి

06-06-2025 08:28:15 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ ను నిర్మల్ కు చెందిన మహిళా కాంగ్రెస్ నేత అల్లూరి కృష్ణవేణి శుక్రవారం కలిశారు. ఆదిలాబాద్ పార్లమెంటు, నిర్మల్ జిల్లా తాజా రాజకీయ పరిస్థితుల గురించి అలాగే మహిళా సాధికారత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల పాత్ర, గెలుపు కోసం ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి అనే విషయాల గురించి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, ఇందిరా ఫెలోషిప్ జోనల్ భాధ్యురాలు శ్రీమతి అల్లూరి కృష్ణవేణి, అదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క, నిర్మల్ నియోజక వర్గ జనరల్ సెక్రటరీ ఎంబరి సౌమ్య, నిర్మల్ పట్టణ మహిళా కాంగ్రెస్ ఆధ్యక్షురాలు వాసవి, సోన్ మండల మహిళా కాంగ్రెస్ ఆధ్యక్షురాలు రేఖ, ఇతరులు పాల్గొన్నారు.