3 July, 2026 | 11:55 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

బడిబాటతో విద్యా దశ మారుతోంది

06-06-2025 08:32 PM

హుజూరాబాద్,(విజయక్రాంతి): బడి బాటతో విద్యాధశ మారుతుందని  ప్రధానోపాధ్యాయురాలు కుమారి శనగరం మేఘన అన్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని బండ అంకుష్ ఏరియాలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట" కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె బండ అంకుష్ వాడ, డిపో క్రాస్ ప్రాంతాల్లోని గుడిసెల్లో నివసించే తల్లిదండ్రులను ఇంటింటి కలిసారు. పిల్లలకు ఉచిత భోజనం, గుడ్లు, పాలు, రాగి జావా, యూనిఫార్ములు, బూట్లు, పుస్తకాలు, నాణ్యమైన ఇంగ్లీష్ బోధన తదితర ప్రభుత్వ విద్యా ప్రయోజనాలను వివరించి, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసానికి తగిన వాతావరణం ఉందని వారికి అవగాహన కల్పించారు.

ప్రజా సంఘాల నాయకుడు వేల్పుల ప్రభాకర్ మాట్లాడుతూ... ప్రైవేట్ పాఠశాలల్లో లక్షలు ఖర్చు చేయడం వల్ల విద్యార్ధులపై చెడు ప్రభావం పడుతుంది. కార్పొరేట్ స్కూల్‌లు తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య దూరం పెంచుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్న టీచర్లు దేశస్థాయి గోల్డ్ మెడల్స్ సాధించిన వారు. నాణ్యమైన విద్యను ఉచితంగా అందించగలిగేది ప్రభుత్వ పాఠశాలలే అని స్పష్టం చేశారు. తల్లిదండ్రులారామీ పిల్లల భవిష్యత్తు కోసం ఆత్మపరిశీలన చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి అని విజ్ఞప్తి చేశారు.