6 August, 2026 | 8:28 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ధర్మరావుపేట విద్యార్థి ఎంపిక   •   వారాంతపు సంతను ప్రారంభించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు   •   300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత   •   ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నిర్వహించిన బోధన్ స్వర్ణకార సంఘం   •   నిజాయితీ, నిరాడంబర జీవనానికి ఆదర్శం ప్రొఫెసర్ జయశంకర్   •   నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి   •   అనుమతి లేకుండా కమ్యూనిటీ హాల్ కూల్చివేత   •   జగ్గయ్యపల్లి ఉపాధి హామీ(వీబీజీ రాంజీ) ఆర్ధిక, అక్రమాలపై ఫిర్యాదులు   •   కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలి   •   ఘనంగా ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు   •  

బదిలీకి ఎఎల్‌ఎం బలి

30-10-2024 01:37 AM
  1. ఆరోగ్యం సరిగా లేదన్నా కనికరించని అధికారి
  2. గుండెపోటుతో విద్యుత్ ఉద్యోగి మృతి

కామారెడ్డి, అక్టోబర్ 29 (విజయక్రాంతి): తన ఆరోగ్యం బాలేదని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నాడు.. అనారోగ్యంతో ఉన్న తల్లికీ సేవ చేయాలని విజ్ఞప్తిచేశాడు.. అయినా ఉన్నతాధికారులు కరుణించలేదు.. దీంతో బదిలీ అయిన ఓ విద్యుత్ అధికారి గుండె ఆగిపోయిన విషాద ఘటన ఆర్మూర్ డివిజన్‌లోని బట్టపూర్‌లో చోటుచేసుకుంది.

విద్యుత్‌శాఖ డివిజన్ అధికారి ఒంటెద్దు పొకడతో బట్టాపూర్‌లో ఎఎల్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాములు సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. విద్యుత్ శాఖలో ఇటీవల బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్ స్వీకరించిన ఉన్నతాధికారులు ఆ తరువాత బదిలీలను పూర్తిచే శారు.

ఆర్మూర్ సబ్‌స్టేషన్‌లో సేవలు అందిస్తున్న శ్రీరాములుకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఆయన తల్లి కాన్సర్‌తో బాధపడుతోం ది. తన పరిస్థితి బాగాలేదని డీఈఈ దృష్టికి తీసుకెళ్లాడు. ఆర్మూర్‌లోనే ఏదైనా సబ్‌స్టేషన్‌లో విధులు కేటాయించాలని  ప్రాధేయపడ్డాడు.

అయి నా ఆ ఉన్నతాధికారి కనికరించలేదు. ఫీల్డ్‌లో పనిచేయాలని ఆదేశించాడు. ఫీల్డ్ వర్క్ తనతో కాదని యూనియన్ నేతతో చెప్పగా అతడూ బుకాయించాడు. సోమవారం తల్లిని చికిత్స నిమిత్తం  హైదారాబాద్‌కు తీసుకెళ్లిన శ్రీరాములు.. గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు.