6 August, 2026 | 9:40 PM

Breaking News

తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ కు బీజేపీ నాయకుల నివాళులు   •   ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమించాలి   •   సిమెంట్ రోడ్లకు గ్రీన్ సిగ్నల్.. నెల రోజుల్లో నిధుల మంజూరు   •   బాధను అనుభవిస్తేనే భావోద్వేగ ప్రేమకథలు రాయగలం   •   గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలి: కల్లుగీత కార్మిక సంఘం   •   ప్రో. జయశంకర్ సార్ కు బిజెపి నాయకుల నివాళులు   •   వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆదేశం   •   భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు   •   మోర్గి మోడల్ పాఠశాల, కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు   •   మొగిలిపేటలో జలసిరి గ్రామ సభ నిర్వహణ   •  

అనుమతి లేకుండా కమ్యూనిటీ హాల్ కూల్చివేత

06-08-2026 08:03 PM

గ్రామ సభ తీర్మానం మేరకు కూల్చినట్లు ఆరోపణలు

ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాల ను కూల్చివేయాలంటే ఆ శాఖ ప్రభుత్వ ఉన్నత అధికారుల ఆదేశాలతో పాటు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు తో భవనాలు కూల్చివేయాలి. కానీ అధికారుల అనుమతులు లేకుండా గ్రామపంచాయతీ పరిధిలో పంచాయతీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఏకంగా నేలమట్టం చేశారు. వివరాలకు వెళితే  ఇంద్రవెల్లి మండలం దన్నోరా (బి) పంచాయతీ పరిధిలోని ఇన్కర్ గూడ గ్రామంలో 1991-92 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన  ఐజేఆర్ వై  పథకం నిధులతో అప్పటి సర్పంచ్ 70 వేలతో  కమ్యూనిటీ హాల్ నిర్మించారు.

అప్పటినుండి  3 ఆగస్టు 2026 వరకు గ్రామస్తులు కమ్యూనిటీ హాల్  ను సద్వినియోగం చేసుకున్నారు. దన్నోరా( బి) పంచాయతీకి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం  వివో భవనాన్ని మంజూరు చేసింది. వివో భవనానికి స్థలం లేదని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి  కమ్యూనిటీ హాల్  తొలగించి వివో భవనం ను నిర్మించాలని  గ్రామ సభలో తీర్మానించారు. గ్రామ సభలో తీర్మానించిన  తీర్మాన పత్రాలతో పాటు  కమ్యూనిటీ హాల్ శిథిలా వ్యవస్థలో చేరినట్లు  ఇంజనీరింగ్ అధికారులతో  ధ్రువ పత్రాలు తీసుకొని  జిల్లా పంచాయతీ అధికారి ద్వారా  జిల్లా కలెక్టర్ నుండి భవనమును తొలగించుటకు  ఉత్తర్వులు తీసుకోవాల్సి ఉంది.

అలాంటివి ఏమీ చేయకుండానే  పంచాయతీ తీర్మానమే  ముఖ్యమని బుధవారం రోజున (05.08.26) కూల్చి భవనం నేలమట్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కమ్యూనిటీ హాల్ ను కూలగొట్టడం  అన్యాయం అంటూ  ప్రజలు అంటున్నారే తప్ప  ధైర్యం చేసి పంచాయతీ పాలకవర్గం ముందు  ప్రజలు ఎందుకు కూలగొట్టారని ప్రజలు ప్రశ్నించే ధైర్యం చేయడం లేదు.  గ్రామ సభ తీర్మానం మేరకు  కమ్యూనిటీ హాల్  తొలగించి వివో భవనం నిర్మించుటకు స్థలాన్ని ఇచ్చామని పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అన్నారు. కమ్యూనిటీ హాల్ కూల్చివేతపై  పంచాయితీ కార్యదర్శి ని " విజయ క్రాంతి"  రిపోర్టర్ వివరణ కోరగా పై విధంగా అనడంతో పాటు  కూల్చుటకు  అధికారుల నుండి అనుమతి తీసుకోలేదని  కార్యదర్శి తెలిపారు.