6 August, 2026 | 10:01 PM

ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నిర్వహించిన బోధన్ స్వర్ణకార సంఘం

06-08-2026 08:10 PM

బోధన్,(విజయ క్రాంతి) బోధన్ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం స్థానిక విశ్వకర్మ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర స్వర్ణకార సంఘం కార్యదర్శి మారోజు సుధాకర్ చారి హాజరై ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బోధన్ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బొప్పాపూర్ హనుమాన్లు చారి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి త్రివేణి నాగరాజు చారి, విశ్వబ్రాహ్మణ సంఘం కోశాధికారి నారోజు వెంకటరమణ చారి, కన్నోజ్‌వార్ బాలాజీ, హుంసా ధర్మపురి చారి, కందుకూరు సత్యనారాయణ చారి, నాగ బ్రహ్మచారి, నరేష్ చారి, కృష్ణపల్లి రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.