వారాంతపు సంతను ప్రారంభించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
రామగిరి,(విజయ క్రాంతి): రామగిరి మండలం చందనాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రతి వారానికి ఒకసారి నిర్వహించే వారాంతపు సంత (వీక్లీ సంత)ను గ్రామ సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ తో కలిసి మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ వారాంతపు సంతలో కూరగాయలు, పండ్లు, కిరాణా వస్తువులు, గృహోపకరణాలు, వ్యవసాయానికి అవసరమైన వస్తువులు, ఇతర నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి వారం జరిగే సంతకు విచ్చేసి, తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమం లో కమన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ ఎస్ అన్వర్ ,చందనాపూర్ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు, మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, మాజీ సర్పంచ్ ఎరుకల ఓదెలు, రామగిరి మండల ల్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రి తదితరులు పాల్గొన్నారు.






