ఘనంగా ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
మహ ముత్తారం,(విజయక్రాంతి): మహా ముత్తారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల మాహముత్తారం ప్రధానోపాధ్యాయులు చేరి ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారము ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి సాంబశివరావు రావు హాజరైనారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ... తెలంగాణ సిద్ధాంతకర్త గా తెలంగాణ పితామహుడుగా జయశంకర్ సార్ ను గౌరవిస్తారని తెలుపడం జరిగింది.
ప్రతి సంవత్సరము ఆగస్టు ఆరున ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పూర్వ వరంగల్ జిల్లాల్లో అక్కంపేట గ్రామంలో 1934 ఆగస్ట్ ఆరో తారీఖున ఆయన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించడం జరిగిందని తన జీవితాన్ని తెలంగాణ ప్రజలకు సంక్షేమానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకితo చేశారని తెలంగాణ సమాజంలోని ప్రజలను చైతన్యం చేస్తూ నిరంతరం కృషి చేశారు.
ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు నీళ్లు నిధులు నియామకాల విషయంలో వారి హక్కుల కోసము జీవితాంతం పోరాడిన మహానీయుడని ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రజలకు చైతన్యం కల్పించేందుకు వినియోగించిన గొప్ప త్యాగద నుడని కొనియాడారు పుట్టుక నిది చావు నిది బ్రతుకంతా తెలంగాణ కొరకు అని భావంతో జీవించిన మహోన్నత మేధావి ఆచార్య జయశంకర్ సార్ అని ఈ సందర్భంగా మండల విద్యాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేరి ప్రభాకర్ తెలుపడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బి. అనిల్, శారద మరియు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల సిబ్బంది హాజరు కావడం జరిగింది






