6 August, 2026 | 9:48 PM

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ధర్మరావుపేట విద్యార్థి ఎంపిక

06-08-2026 08:25 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని ధర్మరావుపేట్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన sk అస్కాన్ అండర్ 16 జావేలింగ్ త్రో విభాగంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, రాష్ట్రస్థాయి  పోటీలకు అర్హత సాధించినట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఐదవ నేషనల్ జావలిన్ త్రో ఛాంపియన్షిప్ 1వ తెలంగాణ స్టేట్ చాంపియన్ షిప్,12వ తెలంగాణ ఈ స్టేట్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిఫ్ లో  ఆగస్టు 7, 8వ తేదీల్లో హనుమకొండ జేఎన్ స్టేడియంలో జరుగునున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఆస్కాన్ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు జోసెఫ్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అధ్యక్షురాలు గ్రామ పెద్దలు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని అభినందించారు.