6 August, 2026 | 9:50 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలకు పారమిత విద్యార్థులు   •   నియోజకవర్గ కేంద్రం నుండి ఏ భవనం తరలిపోదు: మాజీ ఎంపీ   •   మూడున్నర కిలోల కణితి   •   మోడల్ స్కూల్‌లో స్టూడెంట్ లీడర్ కోసం ఎన్నికలు   •   తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ కు బీజేపీ నాయకుల నివాళులు   •   ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమించాలి   •   సిమెంట్ రోడ్లకు గ్రీన్ సిగ్నల్.. నెల రోజుల్లో నిధుల మంజూరు   •   బాధను అనుభవిస్తేనే భావోద్వేగ ప్రేమకథలు రాయగలం   •   గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలి: కల్లుగీత కార్మిక సంఘం   •   ప్రో. జయశంకర్ సార్ కు బిజెపి నాయకుల నివాళులు   •  

300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

06-08-2026 08:12 PM

కోహిర్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కోహీర్ పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు లారీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారంతో లారీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేసి పట్టుబడిన బియ్యాన్ని దిగ్వాల్‌లోని పౌరసరఫరాల గోదాంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బియ్యం మాఫియా అసలు సూత్రధారుల కోసం పోలీసుల దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.