3 August, 2026 | 3:27 PM

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

27-05-2024 01:12 AM

మంచిర్యాల, మే 26 (విజయక్రాంతి): శ్రీరాంపూర్ కృష్ణకాలనీలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయ 1999 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం మంచిర్యాలలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 24 సంవత్సరాల తర్వాత అందరూ ఒక్కచోట కలిశారు. ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు చంద్రశేఖర్, చిన్న, విజయలక్ష్మి, మంజులను ఘనంగా సన్మానించారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకొని ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో గాదర్ల రమేశ్, చంద్రశేఖర్, శ్రీనివాస్, పోషయ్య, సుశ్విత పాల్గొన్నారు.