ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కుమ్రంభీం
కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 26 (విజయక్రాంతి): కుమ్రం భీం ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక అని, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు కుమ్రం భీం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. కౌటాల మండలంలోని తాటిపల్లిలో ఏర్పాటు చేసిన కుమ్రం భీం విగ్రహన్ని భీం మనువడు సోనేరావు, జడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతితో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్ కోసం ఆయుధాలతో పోరాటం చేయడంతో పాటు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా భీం ఉద్యమించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మాంతయ్య, సోయం మనోహర్, పురుషోత్తం, సంతోశ్, విఠల్, బండు, సుమన్‌బాయి తదితరులు పాల్గొన్నారు.
-కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
ఆత్రం సుగుణ






