calender_icon.png 26 May, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

26-05-2025 01:42:27 AM

కామారెడ్డి, మే 25 (విజయ క్రాంతి), కామారెడ్డి వివేకానంద పాఠశాల లో జరిగిన 1993 -94 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళ నాన్ని నిర్వహించారు.

అప్పటి ఉపాధ్యాయులను సన్మానించారు. పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. అప్పటి చిలిపి చేష్టలను, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర సత్యనారాయణ, విశ్వనాథ్, రవీందర్, పూర్వవిద్యార్థులు కుంట లక్ష్మారెడ్డి, సుధీర్, శ్రీనివాస్, సంతోష్, నాగరాజు పాల్గొన్నారు.