calender_icon.png 28 May, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య

26-05-2025 10:16:19 AM

కోట: రాజస్థాన్‌లోని కోట జిల్లాలో జరిగిన విషాదకరమైన సంఘటనలో మరో నీట్ అభ్యర్థి(NEET Candidate) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు ఆదివారం మహావీర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ప్రతాప్ అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 15 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. మృతుడు  కోటాలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(National Eligibility Cum Entrance Test) పరీక్షకు సిద్ధమవుుతున్నాడు. ఈ సంవత్సరం కోటాలో కోచింగ్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న 16వ కేసు ఇది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రి మార్చురీకి పంపారు. ఈ సంఘటన కోటాలో కోచింగ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన విద్యా ఒత్తిడి, మానసిక ఆరోగ్య సవాళ్లను మరోసారి హైలైట్ చేసింది. మే 4న, జాతీయ వైద్య ప్రవేశ పరీక్షకు కొన్ని గంటల ముందు, కోటాలో ఇనుప గ్రిల్‌కు ఉరి వేసుకుని ఒక నీట్ అభ్యర్థి తన జీవితాన్ని ముగించుకుంది. కున్హాడి పోలీస్ స్టేషన్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ మాట్లాడుతూ, ఆ బాలిక మైనర్ అని, విద్యార్థిని మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌కు చెందినదని తెలిపారు.