calender_icon.png 26 May, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్కరాల్లో గవర్నర్

26-05-2025 01:19:38 AM

-కుటుంబ సమేతంగా కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించిన జిష్ణుదేవ్ వర్మ

-సాదరస్వాగతం పలికిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

-11వరోజు 5 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు

మంథని, మే 25 (విజయక్రాంతి)/మహదేవ్‌పూర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సరస్వతీ పుష్కరాలు వైభవంగా కొనసాగుతు న్నాయి. 11వ రోజైన ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుష్కరాలకు హాజరయ్యారు.

ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అధికారులతో కలిసి గవర్నర్‌కు సాదర స్వాగతం పలికారు. వారికి సరస్వతీ మాత ప్రతిమను బహూకరించారు. అనంతరం గవర్నర్ దంప తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. తర్వాత సరస్వతీ మాతను, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం పూజారులు గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం అందించి, శ్వేత వస్త్రం, లడ్డు ప్రసాదం, చక్కెర పొంగలి, అమ్మవారి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు, పుష్కరాల్లో భాగంగా ప్రతిరోజూ  నిర్వహిస్తున్న నవరత్నా మాలా హారతి కార్యక్రమాన్ని వివరించారు.

భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కటి ఏర్పాట్లు చేశారని గవర్నర్ అభినందించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరస్వతీ పుష్కరాల్లో భాగంగా యోగానంద సరస్వతి స్వామిజీ త్రివేణి సంగమంలో పుణ్యస్నామచరించారు.

ఆయనకు కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ద్విలింగాలకు అభిషేకాలు నిర్వహించారు. సినీనటుడు తనికెళ్ల భరణి పుష్కర స్నానం ఆచరించి, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామికి అభిషేకాలు చేశారు.

15 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ముగింపునకు చేరుకోవడం, వారాంతం కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆదివారం దాదాపు 5 లక్షల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీతో కాళేశ్వరం చేరుకొనే మార్గంలో 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు వాహనాలను అటవీ ప్రాంతంలోకి తరలించారు. దీంతో దాదాపు 5 గంటలపాటు భక్తులు ఇబ్బందులు పడ్డారు. 

శైలజా రామయ్యర్ ప్రత్యేక పూజలు 

దేవాదాయ శాఖ ప్రి న్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ ఆదివారం కుటుంబ సమేతంగా కా ళేశ్వర, ముక్తీశ్వర స్వా మిని దర్శించుకొని అభిషేకాలు చేశా రు. అనంతరం ఆమె మాట్లాడుతూ సరస్వతీ పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తు లు విచ్చేస్తున్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని చెప్పారు. పార్కింగ్ సమస్యకూడా ఉన్నందున వాహనదారులు సమన్వయం పాటిస్తూ ముందుకుసాగాలని సూచించారు.

నవరత్న మాలా హారతికి మంత్రి సీతక్క హాజరు

సరస్వతి పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద 11వ రోజు నిర్వహించిన సరస్వతి నవరత్న మాలా హారతి మహోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రా మాణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క , ఎంపీ వంశీకృష్ణ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈ పుణ్య ఘడియలు అందరికీ శ్రేయస్సును, శుభాన్ని కలిగించాలని, సర స్వతి అమ్మవారి కృపతో మన తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిం చాలని ఆకాంక్షించారు.