ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
08-06-2024 02:10 AM
మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి
రంగారెడ్డి, జూన్ 7 (విజయక్రాంతి): పదవి ఉన్నా లేకున్నా చేవెళ్ల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం ఒక ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని.. పదవులు ఉన్నా లేకునా ప్రజా సేవ ఆగదన్నారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించామని, అయితే ప్రజాక్షేత్రంలో ఎన్నికల ఫలితం తన అంచనాలకు భిన్నంగా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల తీర్పుకు కట్టుబడి ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులు అధైర్య పడొద్దని, రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.






