గురుకులాల్లో సత్తా చాటిన అమరావతి పాఠశాల విద్యార్థులు
వెంకటాపూర్, మార్చి 25 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన టిజిసెట్ ఫలితాలు బుధవారం విడుదల కాగా, మండలంలోని లక్ష్మీదేవిపేట అమరావతి విద్యాలయం విద్యార్థులు మరోసారి విశేష ప్రతిభ కనబరిచారు. 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షలకు హాజరైన 40 మంది విద్యార్థులందరికీ సీట్లు రావడం ద్వారా విద్యాలయం వంద శాతం ఫలితాలను సాధించింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా అద్భుత ఫలితాలు సాధిస్తూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
గత 30 సంవత్సరాలుగా లక్ష్మీదేవిపేట మరియు పరిసర గ్రామాల పేద విద్యార్థులకు తక్కువ ఫీజులతోనే కార్పొరేట్ స్థాయికి మించిన విద్యను అందిస్తూ, ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో గురుకుల సీట్లు సాధించడం గర్వకారణమని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యాలయంలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో స్థిరపడినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వీరగాని రాజయ్య తెలిపారు.




