calender_icon.png 6 December, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ ఫామ్ తో రైతులకు ఎంతో మేలు

06-12-2025 08:08:43 PM

ఉద్యానవన, పట్టు పరిశ్రమ జిల్లా అధికారి జి.శ్యామ్ ప్రసాద్

ధర్మపురి,(విజయక్రాంతి): ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందనీ ఉద్యానవన, పట్టు పరిశ్రమ జిల్లా అధికారి జి.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎండపెల్లి మండలం అంబారిపేట గ్రామంలో ప్రదీప్ రెడ్డి అనే రైతు  కు సంబంధించి నాలుగు ఎకరాలలో సాగుచేస్తున్న ఆయిల్ ఫామ్ ను ఆయన శనివారం సందర్శించారు. ఆయిల్ ఫామ్ సాగు పట్ల రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. జిల్లా మొత్తంలో ఇరవైమూడు ఎకరాలలో ఆయిల్ ఫామ్  సాగులో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి డివిజన్ ఉద్యానవన అధికారి అర్చన, విస్తరణ అధికారి వంశీకృష్ణ, ప్రభాకర్, లోహియా, మేనేజర్ భరత్, సిగ్నెట్ మేనేజర్ దేవేందర్, ఫీల్డ్ ఆఫీసర్ యోహాను పాల్గొన్నారు.