calender_icon.png 5 May, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్రవెల్లిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

11-04-2025 12:00:00 AM

పాల్గొననున్న ఎమ్మెల్యే వివేక్

ఆదిలాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): పీడిత వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ని ఏప్రిల్ 14న ఘనంగా అన్ని గ్రామాలలో,  మండల కేంద్రాలలో అన్ని కమిటీలు కలిసి పెద్ద మొత్తంలో నిర్వహించాలని మాల సంక్షే మ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేశ్ పిలుపునిచ్చారు. జిల్లా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనంలో గురువారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 14న సాయం త్రం అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్ర మానికి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి ముఖ్యతిథిగా హాజరవుతున్నారని తెలిపారు.

కావున  జిల్లా, మండల, గ్రామ కార్యవర్గ సభ్యులు పాల్గొని విజయవంతం చేయలని కోరారు. ఈ సమావే శంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి సుధాకర్, గౌరవాధ్యక్షులు మేకల మల్లన్న, కోశాధికారి గంపల ప్రభాకర్, వ్యవస్థాపక అధ్యక్షులు బేర దేవన్న, అసోసియేట్ అధ్యక్షులు సింగరి అశోక్, పాశం రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు స్వామి,  సుభాష్ పాల్గొన్నారు.