calender_icon.png 12 July, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి

12-07-2025 01:39:31 PM

  1. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయ చేతుల్లోనే 
  2. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు పునర్జన్మ అందిస్తారని దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahbubnagar MLA Yennam Srinivas Reddy) అన్నారు. పట్టణం లోని సద్దలగుండు ప్రాంతంలో నెలకొల్పిన కలాం డ్రీమ్ ఫోర్స్ సైన్స్ ల్యాబ్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల్లో దాగిన సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఒక అధునాతనమైన సైన్స్ ల్యాబ్ మన మహబూబ్ నగర్ కు అవసరం ఉందన్నారు.  వాస్తవంగా పిల్లల్లో ఉత్సాహం కనిపిస్తోందని వారిని ప్రోత్సహించడం మనందరి బాధ్యతని చెప్పారు.   

ఒక మంచి ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకోవాలని అఅనుగుణంగా సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసుకుందామని అందుకు మీ అందరూ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వగలిగితే మన విద్యార్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా సైన్స్ ప్రయోగశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ సహకారంతో బడ్జెట్ లో కేటాయింపులు చేయిస్తామని హామీ ఇచ్చారు.  ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించిన సైన్స్ అధ్యాపకులు చర్చించి సైన్స్ ప్రయోగాల ఏర్పాటుకు సంబంధించి నివేదిక తయారు చేసి ఇవ్వాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కలాం డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ సభ్యులు శ్రీదర్ , జనార్ధన్, రవీందర్ గౌడ్, మోహన్ రెడ్డి, వెంకటయ్య, వెంకటేశ్వరమ్మ, బానుకుమారి, చక్రవర్తి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మత్ అలి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.