calender_icon.png 12 July, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

44వ జాతీయ రహదారిపై దారి దోపిడీ

12-07-2025 01:32:22 PM

ట్రక్కులో నుంచి రూ. పది లక్షల విలువైన మొబైల్స్ చోరీ

దర్యాప్తు చేపట్టిన దేవునిపల్లి పోలీసులు

కామారెడ్డి,(విజయక్రాంతి)దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అడ్డగోలుగా దోచుకుంటున్నారు. పోలీసులు ఎంత అలర్ట్ గా ఉంటున్నా దొంగలు చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. ముఖ్యంగా దారి దోపిడీ ఘటనలు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దారి దోపిడీకి పాల్పడే అంతర్ రాష్ట్ర ముఠా(పార్తీ గ్యాంగ్)నెల రోజుల క్రితం కామారెడ్డి పోలీసులకు పట్టుబడింది. కామారెడ్డి పోలీసులు(Kamareddy Police) వల పన్ని దారి దోపిడీ ముఠాను పట్టుకున్నారు. నిందితులను జ్యుడీషియల్​ కస్టడీకి తరలించారు. అయినా, మరోసారి 44వ జాతీయ రహదారిపై దారి దోపిడి ఘటన పోలీసులకు సవాలుగా మారింది. దారి దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్ వద్ద 44వ జాతీయ రహదారిపై మొబైల్స్ లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్కు  లో నుంచి రూ. పదిలక్షల మొబైల్స్ బాక్సులను ఎత్తుకెళ్లారు. డ్రైవర్ దేవునిపల్లి పోలీసుల కు ఫిర్యాదు చేశారు.

ఎస్సై రంజిత్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మొబైల్స్ లోడుతో నాగపూర్ వైపు వెళ్తున్న ట్రక్కును డ్రైవరు శుక్రవారం అర్థరాత్రి కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఓ దాబా వద్ద నిలిపారు. శనివారం తెల్లవారుజామున చూసుకునేసరికి ట్రక్కులో ఉన్న పది లక్షల విలువ చేసి సెల్ ఫోన్లు రెండు బాక్సులు డ్రైవర్ గుర్తించి దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 10 లక్షల విలువైన సెల్ ఫోన్లు చోరీ తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్ ఫై వచ్చి లారీ ట్రక్కు తలుపులు తెరిచి రెండు మొబైల్ బాక్సులను ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారుగా రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఘటనపై దేవునిపల్లి ఎస్ఐ రంజిత్  విచారణ చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకుని ఆధారాల కోసం అన్వేషించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రంజిత్ తెలిపారు.