calender_icon.png 12 July, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవగతం చేసుకుంటూ అద్భుత శిక్షణ పొందండి

12-07-2025 01:29:37 PM

 టాస్క్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): శిక్షణ సమయంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అవగతం చేసుకుంటూ అద్భుతంగా శిక్షణ పొందాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని టాస్క్ శిక్షణా కేంద్రాన్నిఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA visits Task Training Center) సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేర్చుకుంటున్న పనిలో పరిపక్వత ఉండాలని, అప్పుడే మీకు శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. జీవితంలో స్థిరపడాలంటే ఏదో ఒక పని లో ప్రత్యేకత  ప్రతి ఒక్కరిలో ఉండాలని సూచించారు. ఉచితంగా అందిస్తున్న ఏ శిక్షణ మీ జీవిత ఎదుగుదలకు తోడ్పడుతుందని ఆశ భవం వ్యక్తం చేశారు. నేర్చుకున్న శిక్షణతో బయటికి వెళ్లిన తర్వాత మీరు స్థిరపడ్డాము అంటే ఎంతో సంతోషిస్తానని తెలిపారు. ఏదైనా అర్థం కాని విషయాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకొని శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అజ్మత్ అలి, సంజీవరెడ్డి, టాస్క్ సిబ్బంది సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.