12-07-2025 01:43:52 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, (విజయక్రాంతి) : టాస్ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఓపెన్(Open Education) 10వ తరగతి, ఇంటర్మీడియట్ అవకాశాలను అర్హత గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. శని వారం తన ఛాంబర్ లో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, టాస్ రాష్ట్ర ప్రతినిధి వెంకటయ్యలతో కలిసి ఓపెన్ పది, ఇంటర్మీడియట్ సంబంధిత కరపత్రాలు, గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల చేత చదువును మధ్యలో ఆపేసిన వారు, వయసు ఎక్కువ అయినవారు ఈ ఓపెన్ తరగతుల ద్వారా విద్యను అభ్యసించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టాస్ జిల్లా సమన్వయకర్త అశోక్, డి. ఆర్. పి. సుమన్, ఎడ్యుకేట్ గర్ల్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అహ్మద్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.