calender_icon.png 12 July, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీవి కామారెడ్డి డిక్లరేషన్ ను కప్పిపెట్టే డ్రామాలు

12-07-2025 01:46:40 PM

  1. ఆర్డినెన్స్ ఆపి 42శాతం బి.సి.రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలి.
  2. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బి.సి ముఖ్యమంత్రిని నియమించాలి.
  3. జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్.

వనపర్తి,(విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ ను కప్పిపెట్టే డ్రామాలు కాంగ్రెస్ పార్టీ ఆడుతోందని బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్(District President Gattu Yadav) పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఘాటుగా విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రం లోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాస గృహం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బి. సిల ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆర్డినెన్స్ అంటూ మరోసారి మోసం చేస్తుందని ఆర్డినెన్స్ ద్వారా 42శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేటట్లు ఉంటే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి ఎందుకు పంపిందని వారు ఎద్దేవా చేశారు.

50శాతం బి.సి జనాభా దాటితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాలని మీ లెక్కల ప్రకారం 42శాతం రిజర్వేషన్లు ఉన్నపుడు ఎందుకు చట్టబద్దత కల్పించడం లేదని వారు ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ,పార్లమెంట్ ఆమోదం తర్వాతనే బి.సి. రిజర్వేషన్లు అమలు అవుతాయని తెలిసి కాంగ్రెస్ పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీని బద్లాం చేయడానికి కొత్త నాటకానికి తెరలేపిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,గొర్ల కాపరుల జిల్లా మాజీ అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.