12-07-2025 01:35:56 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని తిమ్మాపూర్ లోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(Jyothishmathi Institute of Technology and Science) స్వయం ప్రతిపత్తి కళాశాలలో సిఎస్ ఈ చివరి సంవత్సరం చదువుతున్న కోగిల వారజ హైదరాబాదులోని ఎక్స్పీరియన్ సంస్థలో సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజీ తో పైథాన్ బ్యాకేండ్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించిందని చైర్మన్ జువ్వాడి సాగర్ రావు తెలిపారు. విద్యార్థులకు నిరంతరము యంత్ర విద్యతో పాటు నేటి సమాజం విసురుతున్న సవాళ్లకు అనుగుణంగా పైథాన్, ఐఓటి, ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్నిపెంపొందించేందుకు అనుగుణంగా కళాశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా విద్యార్థులకు ప్రయోజనం కలుగుతున్నదని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ జువ్వాడి సాగర్ రావు విద్యార్థిని తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ జె సుమిత్ సాయి విద్యార్థిని బంగారు భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డా టి అనిల్ కుమార్, డీన్ అకాడమిక్స్ డా పీకే వైశాలి, విభాగాధిపతి డాఆర్ జగదీషన్, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.