12-07-2025 01:37:41 PM
కరీంనగర్, (విజయక్రాంతి): తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ అసోసియేషన్(Telangana All Marriage Bureau Owners Association) 3వ, వార్షికోవం పురస్కరించుకొని (మా తంబ) ఆధ్వర్యంలో వివిధ సేవా రంగాల్లో విశేష కృషి చేసిన రాష్ట్ర కన్వీనర్ చింతల రాజేశం కు రాష్ట్ర చైర్మెన్ రాదండి వెంకటేష్ చేతుల మీదుగా మహానంది అవార్డు ప్రదానం చేశారు. ఈ మధ్యే కరీంనగర్లో లోని ఓక ప్రవేటు వేడుక మందిరంలో దాదాపు 62 మందికి అవార్డులు అందించగా అతిథులుగా సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, టీపీటీ ఏసీపీ బి.గంగాధర్, భాజపా అసెంబ్లీ కన్వీనర్ దూబాల శ్రీనివాస్, భారాస నగర అధ్యక్షుడు హరిశంకర్, మాజీ కార్పొ రేటర్ ఆకుల పద్మనరసన్న, మా తంబ రాష్ట్ర నాయకులు కనపర్తి మురళి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, ముఖ్య సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.