12-07-2025 01:41:44 PM
బుర్ర మధుసూదన్ రెడ్డి, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు
కరీంనగర్,(విజయక్రాంతి): తన 10 ఏటనే బాలికలు, మహిళలోకం పట్ల జరిగిన వివక్షకు వ్యతిరేకంగా పోరాడి ప్రపంచ మానవాళి దృష్టిని ఆకర్షించిన పాకిస్థానీ మలాలా యూసఫ్‌జాయ్ నేడు విశ్వ మహిళలకు, ముఖ్యంగా బాలికలకు ప్రేరణ శక్తిగా నిలుస్తున్నదని సీనియర్ లయన్ కెప్టెన్ డా బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మాలాలా జన్మదినం సందర్భంగా మలాలా దినోత్సవం జరుపుకుంటున్న వేళ స్థానిక నందినీ కాన్వెంట్, వాల్మీకి విద్యాలయంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 17వ ఏటనే నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న మలాలా నేడు తన 28వ ఏట ప్రపంచవ్యాప్తంగా లింగ అసమానతలను రూపుమాపడానికి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.
ఒక కలం, పుస్తకం, టీచర్ మాత్రమే బాలికల జీవితాలను మార్చగలరా నమ్మే మలాలా తన పోరాటాలతో నిండిన జీవితాన్ని ఉదాహరణగా చూపడం హర్షదాయకమని అన్నారు. సభాధ్యక్షత వహించిన డా: యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ నేటి యువత తలరాతను ఏకైక చదువు మాత్రమే మార్చగలదని, విద్యను నమ్మితే పెదరికం పారిపోయి, మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. చదువుకుంటే మెతుకు దొరకుతుందని చదువుకుంటేనే బతుకు మారుతుందని చెప్పారు ఇటీవల ఒక యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందిన డా: యాదగిరి శేఖర్ రావును. విద్యార్థుల సమక్షంలో కెప్టెన్ డా బుర్ర మధుసూదన్ రెడ్డి ఘనంగా సన్మానించారు.