14 April, 2026 | 9:02 PM

అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ కృషి అపారం

14-04-2026 05:25 PM

మానకొండూరు,(విజయక్రాంతి): భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మానకొండూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పలువురు నేతలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను వారు స్మరించుకున్నారు. రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడని దళిత, బలహీన, వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు, భారత స్వతంత్ర సమరయోధుడు, భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఆశయ సాధనకు మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మానకొండూరు మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వవిప్ఆరేపల్లిమోహన్, మాజీ సుడా చైర్మన్ జీవీరామకృష్ణారావు ,సర్పంచ్ వర్షిని, శేఖర్ గౌడ్ , ఉప సర్పంచ్ సాయి శ్రీ- శేఖర్, నాయకులు గడ్డం నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఓదేలు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, వార్డు మెంబర్లు, అంబేద్కర్ సంఘం నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నందగిరి రవీంద్ర చారి,  తదితరులు పాల్గొన్నారు.  అనంతరం బోడ వెంకటయ్య మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.