ఏబీఆర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యం
బూర్గంపాడు సర్పంచ్ మందా నాగరాజు
బూర్గంపాడు,(విజయక్రాంతి): విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమవు తుందని బూర్గంపాడు మేజర్ గ్రామపంచాయితీ సర్పంచ్ మందా నాగరాజు అన్నారు. మండల కేంద్రమైన బూర్గంపాడులోని అంబేద్కర్ కాలనీలో ఏబీఆర్ యూత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ తోకల మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావి ఆయన అన్నారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ రాజ్యాంగాన్ని రాసే స్థాయికి అంబేద్కర్ చేరుకున్నాడని ఆయన అందరి వాడే అని ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అందరూ అ భిమానులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
బోధించు... సమీకరించు.. పోరాడు.. అనే ని నాదం దళితులను ఒక ఐక్యతను పూజిస్తుం దని దళితుల ఆశాజ్యోతి దైవం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని ఆయన అన్నారు. సమాజం లో అ సమానతలు తొలగిపోవాలంటే విద్య తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ తోకల రాజారామ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ఎక్కువ శ్రద్ధ చూపాలని, తద్వారా ఆర్థిక అభివృద్ధితోపాటు సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల లు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం అంబేద్కర్ జయంతి కేకును కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో హెచ్.ఎం. కే సుపాక సీతారామరాజు, విద్యుత్ శాఖ ఉద్యోగి కేసుపాక పుల్లయ్య, సీనియర్ కా నిస్టేబుల్ కేసుపాక ప్రసాద్ రావు, ప్రముఖ గ్రామీణ వైద్యులు కేసుపాక మహేష్,ఏబిఆర్ యూత్ ఆర్గనైజర్స్ తోకల రవి ప్రసాద్, కేసు పాక రాజేష్, అలవాల దుర్గాప్రసాద్, తోకల నాగరాజు, తోకల రాము,తోకల సారయ్య, తోకల వినయ్ పవన్, తోకల సతీష్ కుమార్, తోకల రాము, మాగం టి కార్తీక్, ఆకాష్, కేసు పాక రఘు తదితరులు పాల్గొన్నారు.






