calender_icon.png 6 December, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొట్టిపర్తిలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

06-12-2025 07:54:26 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): గొట్టిపర్తిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పూలమాలతో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించవలసిందిగా కోరుతూ ముఖ్యఅతిథిగా పాల్గొన్న తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సింగిల్ విండో డైరెక్టర్, గొట్టిపర్తి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలకల వెంకన్న యాదవ్, కార్యక్రమ నిర్వాహకులు పాశం ఐలయ్య, అరుంధతి యువజన సంఘం సభ్యులు, గొట్టిపర్తి గ్రామంలో ఉన్నటువంటి మాదిగ జాతి ముద్దుబిడ్డలు అందరూ బిసి సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్య నేతలు ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.