108 అంబులెన్స్ వాహనం తనిఖీ
05-11-2025 05:34 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ 108 అంబులెన్స్ వాహనంను బుధవారం జివికె సంస్థ క్వాలిటీ డిపార్టుమెంట్ అధికారులు వెంకటేశ్వర్లు, ప్రోగ్రామ్ మేనేజర్ భూమ నాగేందర్ తనిఖీ చేశారు. 108 వాహనంలో ఉన్న అన్ని పరికరాలను పరిశీలించి కొన్ని సూచనలు, సలహాలను ఇచ్చారు. ప్రజలకు వాహనం ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరారు. వాహనం పనితీరును చూసిన అధికారులు 108 సిబ్బంది పైలట్ భద్రునాయక్, మెడికల్ టెక్నీషియన్స్ రమేష్ లను అభినందించారు.






